వెలుగై నిలచినపుడు అది
ఒక దీపం
చీకట్లు పారద్రొలుతూప్రకాశిస్తె అది
ఒక జ్యొతి
వెలుగులు పంచుతూ దిశానిర్దేశనం చేసే వేళ
చేసేవేళలో అది ఓ కాగడ
ప్రమాణాలకు సాక్షీభూతమై నిలచిన వేళ
అది అగ్నిహొత్రం
అంతేకాదు -
అది నీలో....
పగగా నిలచి రగిలినపుడు జ్వాల గాను
చింతగమారి జ్వలించినపుడు చితి గాను
మనసుని దహించే జ్వలనశక్తి
ఐనా -
జిజ్ఞస నీలో మొదలైతే అది
అఖండ జ్యొతిగా వెలుగుతుంది
నిత్యచైతన్యానికి ప్రతీకగా మెదులుతూఉంటుంది!!
0 comments:
Post a Comment