ఆటల పాటల అల్లరిలో
చదువు సంధ్యల సాంగత్యంలో
కధలూ కలల సాహసమై
ఎదగాల్సిన బాల్యం...
తరగతి గదుల ఇరుకులలో
ఆటపాటలకు తావే లేని
సంకుచితమైన విద్యా విధానాలతో
కంప్యూటరూ,టీవీల
విషపు ఉచ్చులోబందీ అయిపోయింది
ఆలోచనల రెక్కలతో
సాహసయాత్రలు చేయాల్సిన బాల్యం
అనుబంధాల మధ్య
అనురాగాలతో గుబాళించాల్సిన బాల్యం..
అర్థం కాని భావోద్వేగంతో
తుపాకులలో రక్తపాతాల్ని
రేసులతో అర్థంలేని వేగాన్ని
కంప్యూటర్ 'కీ' బోర్డుతోనే
అందుకునే ప్రయత్నం చేస్తూంది
తప్పు..ఒప్పు తెలియని బాల్యానికి
ప్రపంచాన్ని సాసించే సైబర్ మాయ
'ఇంటర్నెట్' ఉచ్చులు వేసింది
మార్కెట్ మాయజాలానికి
బాల్యం - అనే ఎరచిక్కింది
రేపటి యువత నిస్తేజమౌతూంది
రేపటి భవిత నిద్రాణమౌతూంది
స్వార్థం వీడని రాజకీయం
రక్కస కోరలు చాచింది
ఆహారం , విద్య,వైద్యం
సక్రమంగా ...
అందించాల్సిన ప్రభుత్వం
బంగారు బాల్యానికి
బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం....
అనారోగ్యకర(కల్తీ) ఆహారానికి
తెరచాటు సంకేతాలనిచ్చింది
ముదిరిన రోగాలు, సహాయ 'చర్యాలంటూ
నివారణ ,నియంత్రణ మాటే మరచింది
ప్రాధమిక విద్యా ప్రాధాన్యాన్నే ఏమార్చి
లంచాలతో,అవినీతితో
రాజకీయ లబ్దికి తెరతీసింది
0 comments:
Post a Comment