పదవిని పట్టు కాలేజీ పెట్టు
నిన్నటి మాట
పదవిని పట్టు పార్టీ పెట్టు
కోట్లు మూటగట్టు నేటి మాట
నల్ల ధనం మూటగట్టు
అవినీతి అరాచకమని ఊదరగొట్టు
సమీకరణాలు మొదలు పెట్టు
క్రొత్త పార్టీకి పేరుపెట్టు
ప్రజాసేవ చేసిన వారు
నిన్నటి తరం నాయకులు
పార్టీ సేవ చేసిన వారు
నేటి మేటితరం నాయకులు
క్రొత్త నీరు వచ్చింది
పాత నీరు పోయింది
కొత్త పార్టీ వచ్చింది
పాత పార్టీలో చేరింది
ప్రజాభిమానం ఒక వెల్లువ
అది అవతరించింది ప్రజారాజ్యంలో
కార్యకర్తల అభిమాన ధనం
నిలచి వుంటూందా ఆ 'చేతిని '?
తెల్లని వన్నీ పాలు
నల్లనివన్ని నీళ్ళు నాటిమాట
తెల్లని పాలైనా నల్లని నీరైనా
కల్తీ మాటునే అనేది నేటి మాట
నీరు పల్లమెరుగు
నిజం దేవుడెరుగు
ప్రాజెక్టులు ఇంజనీర్లకెరుక
కోట్లాది రూకలు నాయకుల జేబులెరుగు
కుక్కపిల్ల సబ్బు బిళ్ళ
కాదేది కవితకనర్హం
ఉప్పు - పప్పు,నింగీ-నేలా
కాదేదీ స్కాములకనర్హం
ప్రస్తుత సమాజం లో జరుగుతున్న, మారుతున్న రాజకీయ సమీకరణలు
ReplyDeleteవాటి గురించి కవిత రూపం లో కళ్ళకి కట్టినట్లు చెప్పారు.
"క్రొత్త నీరు వచ్చింది
పాత నీరు పోయింది
కొత్త పార్టీ వచ్చింది
పాత పార్టీలో చేరింది"
ఇది మాత్రం అద్బుతం .....
Wow ! that's a real piece of excellence. You have depicted the exact position of the present politics (politricks) in our state and country.
ReplyDeleteOka samanyudiki prasthutha paristhithipai unna avesham, sagatu manishi pade avedhananu kalagalipi kanulaku impugaa vinasompuga raasaru.
mee bashaprayoganiki, bhava vyaktheekaranaku, vyangyam lo saitham madhuryanni nimpina meeku naa joharlu, abhinandhanalu :)
Regards,
Manikanth.P.
చాలా బాగుందండి. తాజా పరిస్థితులన్నిటినీ అనుసంధానం చేస్తూ చక్కటి చమత్కారాలతో చురకలు అంటించారుగా..
ReplyDelete"కార్యకర్తల అభిమాన ధనం
నిలచి వుంటూందా ఆ 'చేతిని '?"
ఈ ప్రయోగం చాలా నచ్చింది.. ఏమవ్వబోతుందో ఆ అభిమాన సంద్రం.. :O
నానీలు అంటే వేరే అర్దం ఏమైనా ఉందాండి? లేక లోకజ్ఞానం తెలీని ఒక చిన్న పిల్లాడిని సంభోదిస్తూ (నానీలు అని) వ్యంగ్యంగా సంధిస్తున్న తూటాలా?
ReplyDeleteనానీలు అంటే క్లుప్తంగా నాలుగు లైన్లలొ ఛెప్పడం. ఓ రకముగా చెప్పలంటే అందరికీ తెలిసినవిషయమే అని అర్ధం.
ReplyDeleteసేవే మార్గం
ప్రేమే లక్ష్యం
అధికారమెలక్ష్యంగా
మారింది మార్గం
రాజకీయ మార్గం
-మార్చింది గమ్యం
అని మనము అందరం గ్రహించాము కదా! అదే విషయం ఇలా చెప్పానుమరి.
ఓహో క్లుప్తంగా చెప్పడమా! తెలియని విషయం తెలుసుకున్నాను. ధన్యవాదాలు అండి మీ సమాధానానికి..!
ReplyDelete