ఒక్కొక్క భాషకి పలుకుబడి చాలా ముఖ్యం.మాటని పలికే విధానం అది వినే వారి మీద చాలా ప్రభావం చూపిస్తుంది.నోటి మాటల చేత మన్ననలు పొందవచ్చు , మాటల చేత దేవతలు కోరిన వరాలు ఇస్తారు. అలాంటిది ఒక్కోసారి ఆ మాటలు సరిగా వాడనపుడు విరోధుల్ని కొని తెస్తాయని కూడా మనకి తెలుసు.ఒక పండితుని కంటే కూడా వక్త చాలా గొప్పవాడంటారు.ఎందుకంటే
పదివేలమంది పండితుల్లో ఒక్కడే గొప్ప వక్త అవుతాడని పండిత వాక్కు.సభలో అనర్గళంగా మాట్లాడటమే కాదు వారిని చైతన్య పరిచి,తాను చెప్పదలచుకొన్న విషయాన్ని సూటిగా ,స్పష్తంగా చెప్పి మెప్పించాలి.
తప్పుడు మాటలు, తప్పుడు సంకేతాలు వారి ప్రసంగాల్లో దొర్లితే ,అనేకమంది అదే ప్రభావానికి లోనయ్యే ప్రమాదం వుంది.సభలోనే కాదు కాలక్షేపం కబుర్లు కూడా ఆచి తూచి సరిగ్గా మాట్లడాలి.ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు,మంచి విషయాల్నే మాట్లాడాలి.
భారతరాజ్యాంగం ప్రకారం మనకి వాక్స్వాతంత్ర్యం ఉన్నప్పటికి కొన్ని పరిమితులున్నాయి కదా! ఇటీవలి కాలంలో పెనుదుమారం లేపిన వికేఎలేక్స్ ఉదంతం ఉదాహరణ మాత్రమే. మహాత్మగాంధి చెప్పినట్లు "చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు" ఇది చాలా సులభంగా అందరికే అర్ధమయే మాట, నిత్యం గుర్తుపెట్టుకొని ప్రతిమనిషీ ఆచరిచవలిసిన తారకమంత్రం అన్నా అతిసయోక్తి కాదు కదా.సరియైన మాటలు తట్టనపుడు, సరియైన మాటని వ్యక్తీకరించలేనపుదు - ఒకదానికొకటి మాట్లాడేబదులు మౌనాన్ని ఆశ్రయించడం మేలు. మాటకందని భావన్ని కనులు వ్యక్తీకరిస్తాయి.భాష/ మాటతో పనిలేకుండా చిన్న ,పెద్దలెవరైనా విషయాన్ని గ్రహించగలరు.
ఇదండీ, మాటయొక్క కధాకమామీషు. ఇందులో ఎక్కువ మాటలు దొర్లితే మీరు మాత్రం మౌనాన్ని ఆశ్రయించండి.నేనర్థం చేసుకొంటాను.
అందుకే మాటే మంత్రం అన్నారు అనుకుంట!
ReplyDeleteplease watch
ReplyDeletehttp://bookofstaterecords.com/
for the greatness of telugu people.
nice!
ReplyDeleteA L Mohan 9391147144
"పలుకు" అనేది మనకు బల్యం నుండి వ్రుధాప్యం వరకు జీవితం లో ఒక భాగం. అందుకెనేమొ దాని గురించి పెద్దగా పట్టించుకోరు. కాని మన పలుకే మన జీవితం లొ ఎన్నొ మర్పులను తెస్తుంది, అనుభూతులను మిగులుస్తుంది.
ReplyDeleteమీరు ఎంచుకున్న విషయం, అందులో సూక్తి అందరికి ఆదర్శం. నీతి, నిజయితీలు, మంచి చెడు లాంటి భేదాలు మాయమవుతున్న ఈ సమయం లో, ఇలాంటి వాక్కులు ఎంతైనా అవసరం. ఇలాంటి విషయాలు ఇంకా ప్రచురిస్తారని ఆశిస్తూ ..
Manikanth. P.
insights2day.blogspot.com
కొన్ని లక్షల జీవరాసుల్లో "మనిషి మాత్రమే" పొందిన గొప్ప వరం "మాట". ఇంత విలువైన ఆమాటని చక్కగా ఉపయోగిస్తూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నా అభిప్రాయం. అసలు "పలుకు" అన్న పదాన్నే కమ్మని మాటలను సంభోదించడానికి ఉపయోగిస్తారేమో? చిన్న పిల్లలు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, చిలక పలుకులు, "పలుకే బంగారమాయెనా" అని కోదండ రాముణ్ణి అన్నా... ఇవన్నీ మధురమైన మాటల కోవలోకి వస్తాయేమో..!! మాట పలికే తీరు గురించి బాగా వివరించారు.
ReplyDeleteమాటలకందని భావాన్ని కళ్ళతో వ్యక్తీకరించొచ్చు. కాని అది మీ బ్లాగులో కనపడదు కాబట్టి ఏదో ఒకటి వ్రాయాల్సి వస్తుంది.. ;) ఇంక నేను మౌనాన్ని ఆశ్రయించక తప్పడంలేదు.. :( [మాటలు తట్టనప్పుడు మౌనం వహించడం ఉత్తమం కాబట్టి :)]. చిన్న చిన్న అక్షరదోషాలని సరిచూసుకోమని మళ్ళీ మనవి.
ఫ్రణవ్ గారు
ReplyDeleteమంత్రాలన్నీ మాటలేకదా! :)