Monday, September 27, 2010

విలువైనది జీవితం

జీవితం
చాలా చిన్నది
అయినా సుధీర్ఘమైనది
అది అంతం తెలియరానిది
అయినా ఆద్యంతమూ రసమయ భరితం
వసంతాలన్నీ వచ్చి వెళ్ళెవే
వేదనలు మాత్రం నిలచి
భారమై సాగేవి
అంతులేని సాగరాన్ని
అవధుల్లేని ఆకాసాన్ని
చుంబించే సుందర దృశ్యం
ఈ భూగోళం
ఏగిరే పక్షికి ,నడిచే ప్రాణికి
నిలిచే చెట్టుకి - ఓదిగే కొండకి
పుడమే కదా! అమ్మ ఒడి
విలువైనది జీవితం
వ్యర్థం చేయబోకు రాగద్వేషాలతో
భారమై సాగుతుంది బ్రతుకు
అందుకే
ఆనందం పంచాలి
అప్పుడే
తేలికవుతుంది మనసు
సఫలమవుతుంది బ్రతుకు

రావి దుర్గా ప్రసన్న.

{సెప్ 'నేటి నిజం ' 09-09-10}

3 comments:

  1. కవిత బాగుందండి.. స్పూర్తినిచ్చే కవితలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు..

    ReplyDelete
  2. చాలా బాగుంది!
    బాగా రాసారండీ... మొత్తానికి మీ పోస్ట్స్ దాదాపు అన్నీ చదివించేశారు :)

    PS:కాస్త ఆ word verification తీసెయ్యరూ...

    ReplyDelete
  3. inspiring kavitha for developing a positive OUTLOOK.congrats.
    akella lakshmana mohan 9391147144

    ReplyDelete