Monday, September 20, 2010

ఓటమి లో గెలుపు

ఆశ ..ఆశ ఆశ అనేది మనిషికి ఆక్సిజన్ లాంటిది.జీవితం మీద, మనం చెసే పని పని యెక్క ఫలితాల మీదా ,వుండే ఆశతొనే మనిషి బ్రతుకుతున్నాడు. ప్రక్రుతి లొ ఏ ప్రాణీ నిరాశతో కృంగిపొదు.అలాంటిది మనిషి మాత్రం తన వైఫల్యాలకు ఎందుకు కృంగి పొవాలి??

ఆకులు రాలాయని
చెట్టు మొడు కాదుగా!
రెమ్మ రెమ్మనూ క్రొత్త
చిగురులు తొదిగి
పచ్హదనంతో పరిమళించదా?

ఆసలు కూలాయని
అంతరంగానికి ఇంత
మధనమెందుకు??
వేదనలో ... శొధన లేదా??
విధికెదురీదడం కర్తవ్యం కాదా??

ఆత్మ సొధనే ఆలొచనల
కేంద్రం ఐతే గమ్యం నీ చేరువ కాదా!
మొదలు నరికి,కూల్చినా అరటి భొరున విలపించదే !
తన పిలకల మొలకలతో
క్రొత్త క్రొత్త సందడులు చేయదా??
ఓటమిలోనే గెలుపుందని
తేల్చి చెప్పదా??


{ స్వీయ కవిథ- ' ఓటమి లో గెలుపు '
ప్రచురణ - సాహితీ కిరణం మాసపత్రిక Sep'10}

7 comments:

  1. నీ ఆలోచనాతరంగాలు నిరవధికంగా మమ్మల్ని ముంచెత్తాలని కొరుతున్నాను

    ReplyDelete
  2. chaitanya & pamarpita

    ధన్యవాదములు :)

    ammalu

    tappakunda, meeandari aalochana tarangalanu kooda naatho panchukogalaru

    ReplyDelete
  3. కవిత చాలా బాగుందండి..!

    ReplyDelete
  4. chalu baaga rasevu.abhinandanalu.
    mohan,a l

    ReplyDelete